జాతీయ వార్తలు

జనవరి 10న నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 40 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సన్నద్ధమైయింది. నాలుగు నెలల విరామం అనంతరం మరోసారి పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికే ఇస్రో శ్రీకారం చుట్టింది.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి వచ్చే ఏడాది జనవరి 10న పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహమైన కార్టోశాట్-2ఎఫ్ గురువారం అత్యంత భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన పోలీసులు, సిఐఎస్‌ఎఫ్ భద్రత నడుమ శ్రీహరికోటకు తీసుకొచ్చారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇప్పటికే రాకెట్ రెండు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. దీనికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులు మొదటి ప్రయోగ వేదిక వద్ద వేగంగా జరుగుతున్నాయి. మన దేశానికి చెందిన కార్టోశాట్-2ఎప్ ప్రధాన ఉపగ్రహంతో పాటు 36విదేశీ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కొన్ని విదేశీ ఉపగ్రహాలు షార్‌కు చేరాయి. మరో రెండు రోజుల్లో మిగిలిన ఉపగ్రహాలు కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో నాలుగు నెలల సుదీర్ఘ విరామం తరువాత మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో వర్గాల సమాచారం మేరకు జనవరి ఉదయం 9:30గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి-సి 40 ప్రయోగం చేపట్టనున్నారు. కాని ఇస్రో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ రాకెట్ అధికంగా ఉపగ్రహాలు పంపించేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.

చిత్రం..భారీ భద్రత నడుమ షార్‌కు వెళ్తున్న కార్టోశాట్-2ఎఫ్ ఉపగ్రహం