జాతీయ వార్తలు

ఆసేతు హిమాచలం.. ‘కమల’ వికాసం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారానికి వచ్చిన భారతీయ జనతాపార్టీకి ఇటు రాజకీయంగాను, అటు ఎన్నికల పరంగాను ఈ ఏడాది అన్ని విధాలుగా కలసివచ్చింది. రాష్టప్రతి ఎన్నిక మొదలుకొని తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీ అన్ని విధాలుగా విజయదుందుభి మోగించింది. అదే విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో తల్లడిల్లినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పట్టం కట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు సరికొత్త స్ఫూర్తిని ఇచ్చే ప్రయత్నం చేసింది.
రాహుల్‌కు అధ్యక్ష పగ్గాలు అప్పగించాక వెలువడిన గుజరాత్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ దీనే్న భావి విజయసోపానంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించినంత వరకూ ఈ ఏడాదంతా అధికార బిజెపి వ్యూహ ప్రతివ్యూహాలతో విపక్షాలను చిత్తు చేయడమే గాకుండా రానున్న రోజుల్లో కూడా తనకు తిరుగులేని రాజకీయ పట్టును సంపాదించేందుకు గట్టి పునాదులే వేసుకుంది. ఈ ఏడాది ఈ రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలో మరింత ఉత్కంఠ భరితంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గోవింద్‌కు అత్యధిక ఓట్లు
ఇప్పటివరకూ జరిగిన భారత రాష్టప్రతి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 99 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం చారిత్రక పరిణామం. మొత్తం 771 మంది ఎంపీల్లో 756 మంది రాష్టప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని బిజెపి నిలబెట్టిన రామ్‌నాథ్ కోవింద్‌కు పట్టం కట్టారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పోటీచేశారు. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా, మీరాకుమార్‌కు 3,67,314 విలువైన ఓట్లు వచ్చాయి. ఉప రాష్టప్రతి ఎన్నికలో కూడా బిజెపిదే పైచేయి అయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. వెంకయ్యనాయుడు దేశంలో రెండో రాజ్యాంగ పదవిని సొంతం చేసుకున్నారు. ఆయనపై విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. వెంకయ్యకు 516 ఓట్లు రాగా గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి.
మలుపుతిప్పిన యూపీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అఖండ విజయాన్ని నమోదు చేయడం దేశరాజకీయాల్లోనే సంచలనం రేకెత్తించింది. 403 సీట్లు ఉన్న యూపీ అసెంబ్లీలో 312 స్థానాలను సాధించి ‘కాషాయ దళం’ జయకేతనాన్ని ఎగురవేసింది. సమాజ్‌వాదీ పార్టీకి 54 సీట్లు, బహుజన సమాజ్ పార్టీకి 19 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.
ఉత్తరాఖండ్‌లోనూ కమల వికాసం
ఉత్తరాఖండ్ అసెంబ్లీలోని 70 సీట్లలో 57 స్థానాలను కైవసం చేసుకుని భాజపా ఆధిక్యతను చాటుకుంది. త్రివేంద్ర సింగ్ రావత్‌ను సీఎం పీఠం వరించింది. ఆరెస్సెస్ ప్రచారక్‌గా సేవలందిస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తున్న రావత్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం విశేషం.
గోవాలో మెజారిటీ లేకున్నా..
40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఇతరుల సహాయంతో అధికార పగ్గాలు చేపట్టింది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవడంలోనూ బీజేపీ వ్యూహరచన ఫలించింది.
పంజాబ్‌లో కాంగ్రెస్ గాలి
ఈ ఏడాది వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ పరువు నిలిచింది. అధికారంలో ఉన్న బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో 77 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ తన సత్తా నిరూపించుకుంది. 52,407 ఓట్ల అత్యధిక మెజారిటీతో ‘ఆప్’ అభ్యర్థి బల్బీర్ సింగ్‌ను ఓడించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
‘కమలం’ ఖాతాలో మణిపూర్
కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మణిపూర్‌లో రాజకీయ నైపుణ్యం ప్రదర్శించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 21 సీట్లు సాధించిన బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకున్నా ఇతర పార్టీల అండతో అధికారం చేపట్టింది. బీజేపీ కన్నా మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ కాంగ్రెస్ ఇక్కడ విపక్షంగా మారింది.
మోదీ పరువు నిలిపిన గుజరాత్
గుజరాత్‌లో వరసగా ఆరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక్కడ బీజేపీని గట్టెక్కించడానికి ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ 34 జిల్లాల్లో 15 రోజులపాటు ప్రచారం చేశారు. పటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో గుజరాత్‌లో బీజేపీ గెలుపు మోదీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆశించినంత మెజారిటీ రాకున్నా 99 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. రాహుల్ గాంధీ కూడా తన శక్తియుక్తులను ధారపోయడంతో గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 77 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో 5.5 లక్షల మంది ఓటర్లు ‘నోటా’కు మొగ్గు చూపడం విశేషం. విజయ్ రూపానీ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
హిమాచల్‌లో కాంగ్రెస్‌కు దెబ్బ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో 44 సీట్లు గెలిచి బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికల్లో ఓటమి చెందడంతో హిమాచల్ సీఎంగా జైరామ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. వీరభద్రసింగ్ పాలనపై జనం విసుగు చెందడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. కాగా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారం చేపట్టిన దాఖలాలు లేవని మరోసారి రుజువైంది.