జాతీయ వార్తలు

ఏపీకి ఇళ్లు మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేయాలని గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు మంత్రి కాలువ శ్రీనివాసులు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆంధ్రాభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం జరిపిన ప్రజా సాధికారత సర్వే ఆధారంగా అర్హులైన వారికి కేంద్రం ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక కులగణనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, తాజాగా సర్వే అనుసరించి ఏపీలో ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న దాదాపు 31 లక్షల మంది ఉండగా, అందులో కేంద్ర ఇళ్ల పథకానికి వివిధ నిబంధనలను అనుసరించి అర్హులైన వారు 20.99 లక్షల మంది ఉన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇళ్ల కేటాయింపులపై కేంద్రమంత్రి సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. గత మూడేళ్ల కాలంలో ఇళ్ల నిర్మాణం చాలా నత్తనడకన జరిగిందని, ఈ ఏడాది వేగంగా ఇప్పటివరకు 2.11 లక్షల ఇండ్లను నిర్మించినట్టు తెలిపారు. 2019 నాటికి 50వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తిస్థాయిలో పేద ప్రజలకు వ్యయం చేసి ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు.