జాతీయ వార్తలు

తలాక్‌కు కాంగ్రెస్ సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: లోక్‌సభ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించనున్నది. ట్రిపుల్ తలాక్ ఇవ్వటాన్ని క్రిమినల్ చర్యగా నిర్దారించి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించటాన్ని సవరించాలన్నది కాంగ్రెస్ సవరణ ప్రధాన లక్ష్యం. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదించినప్పుడు కాంగ్రెస్ పక్షం వ్యవహరించిన తీరు పార్టీ ఆధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నచ్చ లేదని తెలిసింది. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ప్రతిపాదించిన సవరణలపై ఓటింగ్‌కు డిమాండ్ చేసి ఉండాల్సిందన్నది అధినాయకత్వం భావన. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించేందుకు ఎలా అంగీకరించారని పార్టీ ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రిపుల్ తలాక్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించటం వలన కాంగ్రెస్ విషయంలో ముస్లిం మైనారిటీలకు తప్పుడు సంకేతం వెళ్లందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు మూలంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రాజ్యసభలో ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీకి చెందిన పలువురు సభ్యులు ఈ సవరణలను ప్రతిపాదించనున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ చర్యకు బదులు సివిల్ చర్యగా మార్చేందుకు అంగీకరించని పక్షంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వం దీనికి కూడా అంగీకరించని పక్షంలో కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుపై సభలో ఓటింగ్‌కు డిమాండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నందున ఓటింగ్ జరిగితే ట్రిపుల్ తలాక్ బిల్లు వీగిపోతుందన్నది కాంగ్రెస్ అధినాయకత్వం విశ్వాసం.