జాతీయ వార్తలు

కనికరం చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 9: గుజరాత్ గుల్బర్గ్ మారణకాండ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన 24మందిపై కనికరం చూపించాలని వారి తరపు న్యాయవాది గురువారం ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాటి ఎంపి ఎహ్సాన్ జాఫ్రితోసహా 69మందిని ఊచకోత కోసిన ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం 24మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. నేరస్థులందరికీ మరణ దండన విధించాలని ప్రాసిక్యూషన్ వాదించగా, గురువారం ఉదయం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిబి దేశాయ్ నిందితుల తరపు న్యాయవాది అభయ్ భరద్వాజ్ వాదనలు విన్నారు. ప్రాసిక్యూషన్ డిమాండ్‌కు వ్యతిరేకంగా అభయ్ సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు పూర్తికావటంతో తీర్పునిచ్చే తేదీని శుక్రవారం ప్రకటిస్తానని న్యాయమూర్తి తెలిపారు.