జాతీయ వార్తలు

అణు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి ఎందుకు మార్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. ఏచూరి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు మార్చటం వెనక ఉన్న రాజకీయం ఏమిటని ప్రశ్నించారు. గుజరాత్‌ను సురక్షితంగా ఉంచుకోవాలనే లక్ష్యంతోనే అణు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని, ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత అవసరమైన భద్రతా చర్యలను తీసుకుని అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.