జాతీయ వార్తలు

నెలాంగ్ లోయలో రాజ్‌నాథ్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాక్షి (ఉత్తరాఖండ్), డిసెంబర్ 31: కొత్త ఏడాది వేడుకలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నెలాంగ్ లోయలో జరుపుకోబోతున్నారు. నెలాంగ్ లోయ పర్యటనకు వెళ్తున్న హోంమంత్రి చైనా బోర్డర్‌కు ఆనుకునివున్న ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ దళాలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారని హోంమంత్రి శాఖ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని దళాలను కాస్త నియంత్రణలో ఉంచాలంటూ భారత్‌ను చైనా హెచ్చరించి రోజులు గడవకముందే హోంమంత్రి ఆ ప్రాంతానికి పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత సెప్టెంబర్‌లో సినో-ఇండియన్ బోర్డర్‌లో నాలుగు రోజులపాటు పర్యటించిన హోంమంత్రి, తిరిగి ఆదివారం నుంచి రెండోసారి సరిహద్దుల పర్యటనకు వెళ్తున్నారు. చైనాతో వివాదాస్పద డోక్లాం అంశంపై ప్రతిష్టంభన నెలకొన్న తరువాత, ఒక సీనియర్ మంత్రి రెండోసారి పర్యటనకు వెళ్లడం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇదే ప్రథమం. సముద్ర మట్టానికి 11,700 అడుగుల ఎత్తులోవున్న నెలాంగ్ లోయలో బోర్డర్ అవుట్‌పోస్ట్ వద్ద ఐటిబిపి దళాలతో కలిసి రాజ్‌నాథ్ కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటారు. చుట్టూ పర్వత సాణువుల మధ్యనున్న లోయలో ఈ సీజన్ వాతావరణం భయానకంగా ఉంటుంది. మైనస్ 15 డిగ్రీల చలిలో దళాలు పహారాకాయాల్సి ఉంటుంది. భాగీరథ నదీ తీరాన 3,400 అడుగుల ఎత్తులో వున్న ఐటిబిపి 12వ బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి రాజ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ జవాన్ల కుటుంబాలు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. అక్కడినుంచి పులం సుమ్ద, కోపాంగ్, భైరన్ ఘాటీలను సందర్శించి, అక్కడి జవాన్లతో మాట్లాడతారు. రాజ్‌నాథ్ వెంట ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్‌కె పచండ వెళ్తున్నారు.

చిత్రం..ఉత్తరాక్షిలోని మత్లీ వద్ద ఐటిబిపి దళాల కుటుంబ సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్