జాతీయ వార్తలు

సాధించింది తక్కువ.. ప్రచారం ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్లలో సాధించించింది తక్కువ, ప్రచారం ఎక్కువ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.
ఎన్‌డిఏ హయాంలో త్రిమూర్తులైన మతతత్వం, నిరంకుశత్వం, వ్యాపారతత్వం పెరిగిపోతోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై తమ పార్టీ రూపొందించని చిన్న పుస్తకాన్ని గురువారం ఆయన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకట ఏచూరి దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయటంలో, ఉపాధి కల్పనలో ఎన్డీయే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునే నాథుడే కనిపించటం లేదని ఏచూరి విమర్శించారు. మోదీ పాలనలో అవినీతికి తావులేదన్నది నిజం కాదన్నారు.
వ్యాపం నుండి మోదీ గేట్ వరకు ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగిపోతున్నాయని అన్నారు. లోక్‌పాల్ చట్టాన్ని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ఏచూరి ప్రశ్నించారు. నల్లధనాన్ని అదుపు చేయటం, విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావటంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏచూరు దుయ్యబట్టారు. బిజెపి మంత్రులు, ఎంపీలు విద్వేషపూరిత ప్రసంగాలతో ఇతర మతాల వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లలో నిరంకుశంగా వ్యవహరిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగార్చారని, విదేశాంగ విధానాన్ని భూస్థాపితం చేశారని, దేశాన్ని అమెరికాకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి రేటు గురించి గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం దాని ప్రభావం ఎంతమాత్రం కనిపించటం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడితే ఎగుమతులు ఎందుకు పెరగటం లేదని నిలదీశారు. ధనవంతులకోసం పని చేస్తున్న మోదీ ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గంపై కత్తికట్టిందని, కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కరువు నెలకొన్న ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏచూరి అన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన పథకాల కేటాయింపులపై కోత ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.