జాతీయ వార్తలు

కొత్త ఓటర్లే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నవభారత నిర్మాణంలో యువతే కీలకమని, వారు ఎన్నికల ప్రక్రియలో ఎంత క్రియాశీలకంగా పాల్గొంటే అంతగానూ ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తియుక్తులను సంతరించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఆ విధంగా భారత ప్రజాస్వామ్య పునాదులను పటిష్ఠం చేయాలని మోదీ అన్నారు. ఈ ఏడాదిలో చివరి మన్‌కీ బాత్ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలను, యువత ప్రాధాన్యతను, అలాగే ప్రజాస్వామ్య విలువల గురించి, స్వచ్ఛ్భారత్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక సూచన చేశారు. ఆగస్టు 15న ఢిల్లీలో మాక్ పార్లమెంట్ నిర్వహించాలని, ఇందులో దేశంలోని ప్రతి జిల్లానుంచి ఓ యువకుడు లేదా యువతిని ఎంపిక చేసి రానున్న ఐదేళ్ల కాలంలో నవ భారత నిర్మాణం గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగాలన్నారు. ఈ తరహా పార్లమెంట్‌లను ప్రతి జిల్లాలోనూ ఆగస్టు 15కు ముందే నిర్వహించాలని సూచించారు. కొత్త సంవత్సరం ఆరంభం రోజన ప్రతి ఒక్కరూ ప్రగతిశీల భారతానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాశ్మీర్ పాలనా సర్వీసు పరీక్షలో మొదటి స్థానాన్ని సంతరించుకున్న అంజుమ్ బషీర్‌ఖాన్ స్ఫూర్తిదాయక ఉదంతాన్ని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదం నుంచి బయటపడ్డ బషీర్‌ఖాన్ కాశ్మీర్ పాలనా సర్వీసు పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడని పేర్కొన్న మోదీ, 1990లో బషీర్‌ఖాన్ పూర్వీకుల ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం కారణంగా బషీర్‌ఖాన్ కుటుంబం తమ సొంత గ్రామాన్ని, ఇంటిని వదిలి పారిపోయిందని, బషీర్‌ఖాన్‌పై ఎలాంటి ఉగ్రవాద ప్రభావం పడకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడని, ఆ విధంగా స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడని తెలిపారు. అలాగే రాష్ట్రం నుంచి అనేకమంది బాలికలను తాను కలుసుకున్నానని, వారిలో ఉత్సాహం, స్ఫూర్తి తనకు నిజంగానే విస్మయాన్ని కలిగించిందని మోదీ తెలిపారు. 2000 సంవత్సరం ఆ తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరూ 2018 జనవరి 1న ఓటు హక్కును పొందే వయస్సును సంతరించుకుంటారని పేర్కొన్న మోదీ, ‘ఈ 21వ శతాబ్దపు ఓటర్లకు భారత ప్రజాస్వామ్యం ఆహ్వానం పలుకుతోంది’ అని అన్నారు. ప్రతి ఓటరు కూడా నమోదు చేసుకోవాలని వీరి ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చాలా జాతి నిర్మాణానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. నవ భారతానికి సరికొత్త పునాది ఈ కొత్త ఓటర్లు తమ ఆశలను, ఆకాంక్షలను రంగరించి వేయబోయే ఓటేనని మోదీ స్పష్టం చేశారు. ఇలా కొత్త ఓటర్లు ఎంతమంది నమోదైతే అంతగానూ ప్రజాస్వామ్య స్ఫూర్తి మరింత తేజోవంతం అవుతుందని, అలాగే కోటాను కోట్ల మంది జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడానికి కూడా ఇదే బలమైన సాధనమని మోదీ అన్నారు. కుల, మత, ఉగ్రవాదం, అవినీతి, పేదరికాలకు తావులేని విధంగానే యువత కొత్త భారతాన్ని నిర్మించుకోవాలని మోదీ అన్నారు. అలాగే సమాన అవకాశాలకు ఇది వేదిక కావాలన్నారు. అలాగే శాంతి, సమత, సమైక్యత బలమైన చోదక శక్తిగా ప్రజలను ముందుకు నడిపించాలని మన్‌కీ బాత్‌లో మోదీ ఉద్ఘాటించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియలో ప్రజలు క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా స్వచ్ఛ భారత్‌లోనూ అదే స్థాయిలో నిబద్ధతను కనబరుస్తున్నారని అన్నారు.

చిత్రం..కేరళలోని శివగిరిమఠ్ యాత్రికుల నుద్దేశించి ఆదివారం ఢిల్లీలో
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ