జాతీయ వార్తలు

ఉగ్రవాది.. టెన్త్ విద్యార్థి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: సంక్షుభిత కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయంటూ చెప్పుకుంటూ వస్తున్న భద్రతా దళాలకు నమ్మలేని నిజం ఒకటి తెలిసొచ్చింది. పుల్వామాలోని సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడితో భద్రతా దళాలే కాదు యావద్దేశం ఆశ్చర్యచకితులు కావాల్సిన పరిస్థితి. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు టెన్త్‌క్లాస్ విద్యార్థి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ విద్యార్థి తండ్రి జమ్మూకాశ్మీర్ పోలీసు విభాగంలో పనిచేస్తుండటం మరో విశేషం. టెన్త్ క్లాస్ చదువుతూనే ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం భద్రతా దళాలను షాక్‌కు గురిచేసింది. పుల్వామాలోని సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నవారందరూ కాశ్మీరీలేనని బలగాలు నిర్ధారణకు వచ్చాయి. అయితే పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ మాత్రం ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకుంది. కాగా, గత నెల రోజులుగా బలగాల దాడిలో అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమవుతున్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు దిగుతారనే సమాచారం ఉందని జమ్మూకాశ్మీర్ డిజిపి ఎస్‌పి వాయిద్ పేర్కొన్నారు. నెలరోజుల వ్యవధిలో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ మేనల్లుడు తల్హా రషీద్, జైషే కీలక ఉగ్రవాది నూర్ మహమ్మద్ తాంత్రే వంటి అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.