జాతీయ వార్తలు

ఎన్నికల బాండ్లు వచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఎన్నికల వ్యయ ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఈ ప్రక్షాళనలో భాగంగా ఎన్నికల బాండ్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వీటివల్ల రుణదాతల పేరు బయటకు వచ్చే అవకాశం ఉండదు. బ్యాంకులను మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు ఈ బాండ్లు దోహదం చేస్తాయి. ఈ కొత్త ఎన్నికల బాండ్లు సంబంధించిన విధివిధానాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదలిచే రుణదాతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వీటిని విరాళంగా రాజకీయ పార్టీలకు అందించవచ్చు. ఇలా తమకు అందిన బాండ్లను ఓ ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలు నగదు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలకు లభిస్తూ వస్తున్న నగదు చెల్లింపులకు ప్రత్యామ్నాయంగా ఈ ఎన్నికల బాండ్లను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ బాండ్లు ఎస్బీఐ ప్రత్యేక బ్రాంచిల వద్ద జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పదేసి రోజులపాటు అందుబాటులో ఉంటాయి. పదిహేను రోజుల చెల్లుబాటు వ్యవధి కలిగిన ఈ బాండ్లపై రుణదాతల పేరు ఉండదు. అయితే, వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు బ్యాంకువద్ద కేవైసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రకటనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో చేశారు. 2017 ఫిబ్రవరి 1న ఎన్నికల బాండ్ల ఆలోచనను వెలుగులోకి తెచ్చిన ఆయన, రాజకీయ పార్టీలకు లభించే విరాళాల ప్రక్రియను పారదర్శకంగా తీర్చిదిద్దమే దీని ఉద్దేశమన్నారు. నాడు తాను చేసిన ప్రకటనకు తుదిరూపం లభించిందని, నేటినుంచే ఎన్నికల బాండ్లపై అధికారికంగా నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. బాండ్‌గా పేర్కొంటున్నప్పటికీ వీటిపై ఎలాంటి వడ్డీ ఉండదు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీలకూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచే విరాళాలు అందుతూ వస్తున్నాయి. ఇప్పుడు దానికి బదులు బ్యాంకుల మధ్యవర్తిత్వంలో రాజకీయ పార్టీలకు నిధులు చెల్లించే అవకాశం ఉంటుంది. కాగా, దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ‘రుణదాత పేరు లేనపుడు ఈ బాండ్లను విడుదల చేయాలనే ఉద్దేశం ఏవిధంగా
నెరవేరుతుంది’ అని ప్రశ్నించారు. అయితే, రుణదాతల బ్యాలెన్స్ షీట్‌లో ఇందుకు సంబంధించిన అంశాలు ఉంటాయని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని జైట్లీ వివరించారు. గత ఎన్నికల్లో కనీసం 1శాతం ఓట్లను సంతరించుకున్న నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల బాండ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు తమ బ్యాంకు అకౌంట్ వివరాలు అందచేయాల్సి ఉంటుందని, 15 రోజుల్లోనే
ఈ బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, ఆయా రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో తమకు ఎంతమొత్తం విరాళంగా వచ్చిందీ ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుందని జైట్లీ తెలిపారు. రుణదాతల పేర్లను బాండ్లపై లేకుండా చేయడానికి కారణాన్ని కూడా ఈ సందర్భంగా జైట్లీ వివరించారు. రుణదాతల పేర్లను బహిర్గతం చేస్తే మళ్లీ నగదు విరాళాలకే మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత విధానంలో నల్లధనమే విరాళాలుగా వెళ్తోందని పేర్కొన్న ఆయన, కొత్త విధానం అమల్లోకి వస్తే పూర్తిస్థాయిలో కాకున్నా విరాళాలకు సంబంధించి దాదాపుగా పారదర్శకతను సాధించగలుగుతామన్నారు.