జాతీయ వార్తలు

రెండో రాజధానిగా హైదరాబాద్ ప్రతిపాదన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ రెండో రాజధానిగా ఏర్పాటుకు ఎటువంటి ప్రణాళిక లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ దక్షిణ భారతదేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కాపు రిజర్వేషన్ల బిల్లు ఇంకా చేరలేదు: కేంద్రం
కాపు రిజర్వేషన్లను రాజ్యాంగలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కాపు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తమ వద్దకు ఇంకా రాలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ వెల్లడించారు. గుంటూరు ఎంపీ గల్లా జయ్‌దేవ్ లోక్‌సభలో ప్రభుత్వ సర్వీసుల్లో, విద్య తదితర అంశాలలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిందా అని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో సైనిక్ స్కూల్
ఏర్పాటు చేయండి : మల్లారెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సైనిక్ స్కూళ్లు రెండూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినందున తెలంగాణలోని మల్కాజిగిరి ప్రాంతంలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోక్‌సభలో మంగళవారం ఆయన ప్రత్యేక ప్రస్తావన చేశారు.