జాతీయ వార్తలు

ఒకేసారి చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: బధిర బాలిక అత్యాచార బాధితురాలికి 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఏకకాలంలోనే చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ బాలిక అత్యాచార కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. అత్యాచారానికి గురైన ఈ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ కేసుకు సంబంధించి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పునిస్తూ బాధితురాలికి జీవితకాలం ప్రతి నెలా 30వేల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవరించాల్సిన అవసరం లేదని తొలుత భావించినా, నష్టపరిహార చెల్లింపులో మాత్రం సవరణలు చేసింది. బధిర బాలిక కావడంతో నష్టపరిహారాన్ని ఏకకాలంలో చెల్లిస్తేనే మంచిదని భావించినట్లు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ తీర్పులో పేర్కొంది. నష్టపరిహారం మొత్తాన్ని జాతీయ బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలని, రాష్ట్ర న్యాయసేవల అథారిటీకి చెందిన మెంబర్ సెక్రటరీతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కూడా తీర్పులో పేర్కొంది. ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని వివరించింది. బాలిక సంక్షేమం కోసం ఈ నిధి సక్రమంగా ఖర్చు చేసేలా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
అత్యాచార బాధితులకు జీవితకాలం నష్టపరిహారం చెల్లించే పథకం ఏదీ లేదంటూ హిమాచల్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం బెంచ్ బాధిత బాలికకు నష్టపరిహార మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాలని ఆదేశించింది.