జాతీయ వార్తలు

క్లినికల్ ట్రయల్స్ పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: క్లినికల్ ట్రయల్స్‌లో తరచూ ఎదురయ్యే మరణాలు, ప్రతిబంధకాలను ధీటుగా ఎదుర్కొని ఉత్తమమైన, బలమైన వ్యవస్థను రూపొందించనున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఈమేరకు జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2016లో తీవ్రమైన ప్రతికూల సంఘటనల నేపథ్యంలో 378 మరణాలు సంభవించగా, వీటిలో 11 క్లినికల్ ట్రయల్స్ ద్వారానే జరిగాయని తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సంఘటనలపై పరిశీలనకు వీలుగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అత్యున్నతస్థాయి కమిటీని నియమించినట్టు ఆమె తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా మందులు అమ్మడాన్ని నిరోధించేందుకు సుప్రీం తీర్పు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విధానాన్ని మరింత పటిష్టవంతం చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా 33 మందులకు అనుమతి ఇవ్వడాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తావించినట్టు ఆమె తెలిపారు. 2013లో సుప్రీంకోర్టు జారీచేసిన ఆర్డర్ ప్రకారం తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు వీలుగా ముగ్గురు సభ్యులు గల నిపుణుల కమిటీని నియమించినట్టు కేంద్రమంత్రి రాజ్యసభలో సమాధానం చెప్పారు. 2013 సంవత్సరానికి ముందు క్లినికల్ ట్రయల్స్‌లో జరిగే తప్పిదాల్లో బాధితులకు సరైన నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీమళ్లీ జరిగేందుకు ఆస్కారం లేకుండా బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు గట్టి చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే దురదృష్టకర సంఘటనలను మరింత తగ్గించేందుకు తద్వారా బాధితులకు సరైన, సకాలంలో నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడతామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదిలావుండగా 59వ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు రంజిత్‌రాయ్ చౌదరి చైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ 33 క్లినికల్ ట్రయల్స్‌ను మాఫీ చేసినట్టు తెలిపారు.