జాతీయ వార్తలు

సెలెక్ట్ కమిటీకి ‘మెడికల్ బిల్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు-2017 పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మంగళవారం జరగాల్సిన వైద్యుల సమ్మె ఉపసంహరించుకున్నారు. బిల్లును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ సేవలు 12 గంటల పాటు నిలిపివేయాలని ఐఎంఐ నిర్ణయించింది. అయితే బిల్లును పార్లమెంటు స్థాయి సంఘానికి పంపాలని మంగళవారం లోక్‌సభ నిర్ణయించినందున సమ్మెను ఉప సంహరించుకున్నట్టు ఐఎంఐ వెల్లడించింది.తమ విజ్ఞప్తిని మన్నించి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన లోక్‌సభ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే అగర్వాల్ స్పష్టం చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు(ఎన్‌ఎంబీ)ని దేశ వ్యాప్తంగా వైద్యులు వ్యతిరేకించారు. వైద్యుల ఆందోళనకు ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో లోక్‌సభలో ఎన్‌ఎంబీ అంశాన్ని లేవనెత్తారు. అయితే బిల్లును పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలనకు పంపుతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ సభలో ప్రకటించారు.