జాతీయ వార్తలు

అమరావతికి 3324 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: అమరావతి రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టుకు ఏపీ కోరిన రుణ దరఖాస్తు ప్రపంచ బ్యాంకు వద్ద పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.3,324 కోట్లు రుణం కోరతూ ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు సమర్పించిందని జైట్లీ వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అరుణ్ జేట్లీ రాతపూర్వక సమాధానమిస్తూ.. రుణ మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రారంభించిన అధ్యయనం, మదింపుప్రాథమిక దశలో ఉందన్నారు. ప్రాజెక్టు మందింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రుణానికి సంబంధించిన సంప్రతింపులు ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ సంప్రతింపుల ప్రక్రియ పూర్తయిన తరువాతే ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసంరించి జనరల్ క్యాటగిరీ రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకువంటి బహుముఖ ఆర్థిక సంస్థల నుంచి పొందే ఆర్థిక సాయం మొత్తం వ్యయంలో 70శాతం మించకూడదని, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత వనరుల నుంచే సమకూర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగే ఖర్చును రుణంలో భాగంగా ప్రపంచ బ్యాంకు నియమిత కాలపరిమితి ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తుందని మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు.
మూడేళ్లలో 1500 కోట్లు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం తదితర సదుపాయాల నిర్మాణానికి గడిచిన మూడేళ్లలో రూ.1500 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి రాధాకృష్ణన్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నూతన రాజధానిలో సదుపాయాల కల్పనకు ప్రత్యేక సహాయం కింద కేంద్రం నిధులు విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి వివరించారు.