జాతీయ వార్తలు

ట్రక్కును ఢీకొన్న స్కూల్ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 5: ఓ స్కూల్ బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో అయిదుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ మరణించారు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ వద్ద బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు ట్రక్కును ఢీకొనగా అయిదుగురు విద్యార్థులు సహా బస్సు డ్రైవర్ మృతిచెందినట్లు ఇండోర్ డిఐజి హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరిలించారు. విద్యార్థులను వారి ఇళ్లవద్ద దింపేందుకు బస్సు బయలుదేరిందని, అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొందని అదనపు ఎస్పీ మనోజ్‌కుమార్ రే తెలిపారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని హోం మంత్రి భూపేంద్రసింగ్ పోలీసు, రవాణాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, స్కూల్ బస్సుల విషయంలో కఠిన నిబంధనలు అమలుచేస్తామని విద్యాశాఖ మంత్రి దీపక్ జోషి తెలిపారు. పిల్లల భద్రతకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను పాటించాలని విద్యాసంస్థలకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశామన్నారు.