జాతీయ వార్తలు

లాలూకు నేడు శిక్ష ఖరారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, జనవరి 5: పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్థారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, శిక్షల తీర్పుపై మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. డిసెంబర్ 23న లాలూను దోషిగా నిర్థారించిన సీబీఐ కోర్టు, జనవరి 3న శిక్షలను ఖరారు చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో తీర్పు వాయిదా పడటంతో, లాలూకు శుక్రవారం శిక్షలు ఖరారు చేస్తారని అనుకున్నారు. శుక్రవారం సైతం శిక్షల తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శిక్షలు ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. ఇదిలావుంటే, దోషిగా నిర్థారణ జరిగిన తరువాత బిర్సాముండా సెంట్రల్ జైలుకెళ్లిన లాలూ, సీబీఐ ప్రత్యేక కోర్టు శివపాల్ సింగ్ ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అనారోగ్యం, వయోభారం కారణంగా శిక్షలు తగ్గించాలంటూ రాతపూర్వకంగా కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ విచారణ అనంతరం కోర్టు హాలు నుంచి బయటకు వచ్చిన లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ ప్రసాద్ వెల్లడించారు. ‘శిక్షల తీర్పు శనివారం ప్రకటించనున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు’ అని మీడియాకు వివరించారు. పశు దాణా కుంభకోణానికి సబంధించి ప్రస్తుత కేసులో సీబీఐ కోర్టు ఇప్పటికే విచారణ ముగించింది. 1990 నుంచి 94 మధ్య బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నపుడు పశువుల దాణా విషయంలో ట్రెజరీ నుంచి 89.27 లక్షల కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగం నిర్థారణ అయ్యింది. ఈ కేసులో లాలూ సహా పదిమందికి సీబీఐ కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేయాల్సి ఉన్నా వాయిదా పర్వం కొనసాగింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శిక్షల తీర్పు వెలువరించనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. శిక్షణ తీర్పు విషయంలో శుక్రవారం లాలూ వాదన సహా ఆర్జేడీ నాయకుడు ఆర్‌కె రాణా, ఐఏఎస్ మాజీ అధికారి పూల్‌చంద్ సింగ్, మహేష్ ప్రసాద్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి సుభీర్ భట్టాచార్య, సరఫరా/రవాణాదారు త్రిపురారి మోహన్ ప్రసాద్, సుశీల్ కుమార్ సిన్హా, సునీల్‌కుమార్ సిన్హా, రాజారాం జోషి, సంజయ్ అగర్వాల్, సునీల్ గాంధీల వాదనలు సైతం విన్నది. గురువారం నాటి పరిణామాల్లో ఐఏఎస్ మాజీ అధికారి బెక్ జులియస్, గోపీనాథ్ దాస్, ఆర్జేడీ నాయకుడు జగదీష్ శర్మ, రవాణా/ సరఫరాదారు జ్యోతికుమార్ ఝా, కృష్ణకుమార్ ప్రసాద్‌ల వాదనలు వినడం తెలిసిందే. కేసు తీవ్రత, జరిగిన వాదనలు, లాలూ విజ్ఞప్తి నేపథ్యంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చిత్తరంజన్ ప్రసాద్ వివరించారు. ఇదికాకుండా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మెడకు మరో దాణా కేసు చుట్టుకుని ఉండటం తెలిసిందే.