జాతీయ వార్తలు

‘ఆధార్’ సమాచారానికి భద్రత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ‘ఆధార్’ సమాచారం పూర్తి భద్రతతో ఉందని, అది దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని ‘విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యుఐడీఏఐ) ప్రకటించిన మర్నాడే- ‘ఆధార్’ సమచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ అమెరికాకు చెందిన విమర్శకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తన వాదన వినిపించారు. భారత ప్రభుత్వం ‘ఆధార్’ పేరిట సేకరించిన సమాచారానికి భద్రత ప్రశ్నార్థకమేనని, అది దుర్వినియోగమయ్యే వీలుందని ఆయన తెలిపారు. సిబీఎస్ జర్నలిస్టు జాక్ విట్టేకర్ చేసిన ‘ట్వీట్’కు స్నోడెన్ స్పందిస్తూ, వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రభుత్వాలకు అలవాటేనని అన్నారు. నిజానికి చట్టాల ప్రసక్తే ఉండదని, సమచారం దుర్వినియోగం కావడం అన్నది చరిత్ర చెప్పిన సత్యమన్నారు. అంతకుముందు విట్టేకర్ తన అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ, భారత ప్రభుత్వం 1.2 బిలియన్ల వ్యక్తులకు చెందిన సమాచారాన్ని సేకరించిందని, ఆ సమాచారం బయటకు పొక్కిందని, డబ్బులిచ్చి కొనుక్కునేందుకు కూడా సమచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ‘యుఐడీఏఐ’ స్పందిస్తూ, ‘ఆధార్’ వివరాలకు భద్రత ఉందని, అవి బయటకు పొక్కే అవకాశం లేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.