జాతీయ వార్తలు

విభజన నాటికి ఆర్థిక సంక్షోభం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణన్ వెల్లడించారు. విభజన నాటి ఏపీ, ప్రస్తుత ఏపీ ఆర్థిక స్థితిగతులపై వైకాపా లోక్‌సభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్ శుక్రవారం నాడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి రుణభారం ఇతర రాష్ట్రాలతో పొల్చితే సాధారణంగానే ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఆర్థిక సంఘం అంచనాల పరిధిలోనే ఉందని ఆయన చెప్పారు. అలాగే 2016 మార్చి నాటికి ఏపీలో 1.73 లక్షల కోట్లు రూపాయలు, 2017 మార్చి నాటికి 1.92 లక్షల కోట్లు రూపాయలు అప్పుల్లో ఉందని చెప్పారు. అలాగే 2018 మార్చి నాటికి 2.16 లక్షల కోట్లు రూపాయలు రుణభారంలో ఏపీ ఉండనుందని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్
విడుదల చేయండి: వై.వి సుబ్బారెడ్డి
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని వైకాపా ఎంపీ వై.వి సుబ్బారెడ్డి కేంద్ర రైల్వేశాఖ పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసిన వై.వి సుబ్బారెడ్డి, గత మూడు సంవత్సరాల నుంచి దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేదని, ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వేజోన్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఒక వినతి పత్రం కేంద్రమంత్రికి సమర్పించారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని మంత్రికి వై.వి సుబ్బారెడ్డి లేఖ రాశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో వై.వి సుబ్బారెడ్డి వెల్లడించారు.
విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే: మంత్రి మనోజ్‌సిన్హా
మొబైల్ ఫోన్ల నుంచి విదేశాలకు డేటా లీకవుతున్న విషయం వాస్తవమేనని, అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా వచ్చిన వార్తలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శుక్రవారం నాడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంక్షిప్త సందేశం (ఎన్‌క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.
పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణత తగ్గింది
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణత తగ్గినట్లుగా వ్యవసాయ శాఖ సహాయమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లఖితపూర్వకంగా జవాబిస్తూ 2016-17 ఖరీఫ్ సీజన్‌తో పోలీస్తే, ఈ ఏడాది 2017-18 ఖరీఫ్ సీజన్ పప్పు ధాన్యాల సాగు తగ్గిందని మంత్రి వెల్లడించారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అవినాష్‌రెడ్డి
కడపలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో తన గౌరవానికి భంగం కలిగించారంటూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమీత్రా మహాజన్‌ను అవినాష్‌రెడ్డిని కలిశారు. కడపలోని తన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాను మాట్లాడుతుండగా మైక్ లాక్కొని అవమానించారని ఒక వినతి పత్రం స్పీకర్‌కు సమర్పించారు. అలాగే ఒక రౌడీషీటర్ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని, తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.