జాతీయ వార్తలు

హజ్ కోటాలో వివక్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: రాష్ట్రాలకు హజ్ యాత్రీకుల కోటా పంపకాలకు సంబంధించి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. హజ్ కోటా పంపకాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నట్టుందని కేరళ హజ్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారిస్తూ కేరళ హజ్ కమిటీ అభియోగంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణకు సంబంధించి కేరళ హజ్ కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఏటా 1.7 లక్షల మందిని భారత్ నుంచి హజ్ యాత్రకు యుఏఈ ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ కోటా ప్రకారం రాష్ట్రాల్లోని ముస్లిం జనాభా ప్రాతిపదికన హజ్ యాత్రీకులను అనుమతిస్తున్నట్టు వివరించారు. అయితే, ఈ విధానం రాష్ట్రాల పట్ల వివక్షకు తావిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉదాహరణకు బీహార్‌లో హజ్ యాత్ర కోసం 6.9వేల మంది దరఖాస్తు చేసుకుంటే 12వేల మందిని అనుమతించారని, అదే కేరళ నుంచి 95వేల మంది ముస్లింలు దరఖాస్తు చేసుకుంటే ఆరువేల మందికే అవకాశం దొరికిందని వివరించారు. ‘కేంద్రం అనుసరిస్తోన్న విధానం వివక్ష చూపుతున్నట్టే ఉంది. బీహార్ నుంచి దరఖాస్తు చేసుకున్న ముస్లింలు అందరికీ హజ్ యాత్రకు అవకాశం లభిస్తే, కేరళలో దీనికి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది’ అని ప్రశాంత్ భూషణ్ వాదించారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న దేశంలోని ముస్లింలు అందరినీ డ్రా ప్రాతిపదికన అనుమతిస్తే వివక్షకు తావుండదని సూచించారు. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానం వివక్షతో కూడుకున్నదిగా కనిపిస్తోందని వాదించారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ 31 రాష్ట్రాల్లోని హజ్ కమిటీల ఆమోదంతో కేంద్ర కమిటీ సూచనల మేరకే కోటా పంపకాల విధానాన్ని అనుసరిస్తున్నట్టు వివరించారు. తదుపరి కేసు విచారణ జనవరి 30కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.