జాతీయ వార్తలు

త్వరలోనే స్వదేశానికి రోహింగ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 5: మైన్మార్‌లో సైనిక దాడులకు భయపడి తమ దేశానికి వలస వచ్చిన రోహ్యింగాలను తిరిగి స్వదేశానికి పంపే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని బంగ్లాదేశ్ సమాచార మంత్రి హసానూల్ హక్ వెల్లడించారు. రోహింగ్యా శరణార్థులందరినీ మైన్మార్ పంపుతామన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో చోటుచేసుకున్న సైనిక చర్యతో వేలాది మంది రోహ్యింగాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. ‘రోహింగ్యా శరణార్థుల విషయంలో బంగ్లాదేశ్, మైన్మార్ ప్రభుత్వాల మధ్య ఓ ఒప్పదం కుదిరింది. వారిని మైన్మార్‌కు పంపే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది’ అని మంత్రి తెలిపారు. అయితే అది ఎప్పుడు మొదలెట్టాలన్న దానిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రోహింగ్యాల వలసలపై తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ప్రధాని షేక్ హసీనా అన్ని చర్యలూ తీసుకుంటున్నారని బంగ్లా మంత్రి వెల్లడించారు. శరణార్థులతో ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనప్పటికీ తమ ప్రభుత్వం తట్టుకుని నిలబడిందని హసానూల్ అన్నారు. 2017 ఆగస్టులో మైన్మార్‌లో రఖీనే రాష్ట్రంలో రోహింగ్యాలపై సైనిక చర్య జరిగింది.
దీంతో సుమారు 6 లక్షల మంది రోహింగ్యాలు సరిహద్దునే ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. శరణార్థ శిబిరాల్లో స్క్రూట్నీ నిర్వహించిన తరువాత స్వదేశానికి పంపే కార్యక్రమం మొదలవుతుందన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లపై సమాచారం లేదన్న మంత్రి భారత్-బంగ్లా ప్రజలు కుటుంబ సభ్యుల్లా మెలుగుతున్నారని కితాబిచ్చారు. త్రిపుర, అస్సాం రాష్ట్రాను ఆనుకుని బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది. సరిహద్దులో శాంతియుత వాతావరణమే ఉందని, ఎక్కడా హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌ను ఉగ్రవాదరహిత దేశంగా చేయడానికి హసీనా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ ప్రాంతమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం లేదని సమాచార మంత్రి స్పష్టం చేశారు.