జాతీయ వార్తలు

ప్రముఖ జర్నలిస్టు ఇందర్ మల్హోత్రా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రఖ్యాత పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా(86) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఆసుపత్రిలో కృత్రిమ శ్వాసపై ఉన్న మల్హోత్రా శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దేశంలో ఎన్నదగిన పాత్రికేయులలో ఒకరైన మల్హోత్రా ది స్టేట్స్‌మన్, టైమ్స్‌ఫ్ ఇండియా, న్యూఢిల్లీ వంటి పత్రికల్లో పనిచేశారు. 1965 నుంచి మూడు దశాబ్దాల పాటు అంతర్జాతీయ పత్రిక ది గార్డియన్‌కు కాలమ్ రాశారు. 1986లో నెహ్రూ ఫెలో, వుడ్రో విల్సన్ ఫెలోలను పొందిన జర్నలిస్టు ఈయన. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వ్యక్తిగత, రాజకీయ ఆత్మకథ, డైనాస్టీస్ ఆఫ్ ఇండియా అండ్ బియాండ్, ఫ్రెష్ బయాగ్రఫీ ఆన్ ఇందిరాగాంధీ అన్న పుస్తకాలు ఇందర్ మల్హోత్రా రచించారు.