జాతీయ వార్తలు

కూలిన ఓఎన్‌జీసీ హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: దేశ వాణిజ్య రాజధాని ముంబయి తీరాన సముద్రంలో శనివారం ఉదయం ఓ హెలీకాప్టర్ కుప్పకూలిపోయింది. ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నారు. మూడు మృతదేహాలు లభ్యం. పవన్ హాన్స్ సంస్థకు చెందిన హెలీకాప్టర్ దౌఫిన్ ఎన్-3 జూహూ ఎయిర్‌డ్రోమ్ నుంచి టేకాఫ్ తీసుకున్న తరువాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. హెలీకాప్టర్ 11 గంటలకు బాంబే హై రిగ్గుకు చేరుకోవల్సి ఉండగా కుప్పకూలిపోయిందని కోస్ట్‌గార్డ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మూడు మృతదేహాలను లభ్యమయ్యాయని ఆయన అన్నారు. మొత్తం హెలీకాప్టర్‌లో ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలెట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. మూడు మృతదేహాలను నేవీ నౌకలు కనుగొన్నాయని కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. మిస్సయిన హెలీకాప్టర్ ఆచూకీ కోసం అటుగా రావల్సిన నౌకలను దారిమళ్లించినట్టు అధికార ప్రతినిధి చెప్పారు. పవన్‌హాన్స్ హెలీకాప్టర్ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)తో దర్యాప్తు చేయనుంది. ఏఏఐబీ పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఏఏఐబీ దర్యాప్తునకు డీజీసీఏ సహకరిస్తుందనని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఇది ప్రమాదావశాత్తూ జరిగిన విషాదమేనని ఆయన అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఇండియా కోస్ట్‌గార్డ్ నౌకను సంఘటనా స్థలానికి చేరుకుంది. శకలాలు గుర్తించింది. పనె్నండున్న గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీసింది. ఇప్పటికి మూడు మృతదేహాలు లభ్యమయ్యాని, మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలిపారు.