జాతీయ వార్తలు

ఇప్పటికైనా నోరువిప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మాదిరిగానే ప్రజాస్వామ్యం కోసం నిర్భయంగా తమ మనసులోని మాటను వ్యక్తీకరించాలని పార్టీ సహచరులు, మంత్రులకు బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో 1975నాటి ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, పార్లమెంటు సమావేశాలు కూడా సక్రమంగా జరగడం లేదని యశ్వంత్ అన్నారు. పార్లమెంటు సక్రమంగా పనిచేయకపోతే సుప్రీం కోర్టులోనూ సరైన వ్యవస్థ లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని శనివారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో సిన్హా అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నలుగురు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని యశ్వంత్ అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పరితపించే ప్రతి ఒక్కరూ తమ మనసులోని మాటను నిర్భయంగా బయటకు చెప్పాలని పిలుపునిచ్చిన యశ్వంత్, బీజేపీ నాయకులు, సీనియర్ కేబినెట్ మంత్రులు కూడా ఈ విషయంలో ముందుకు రావాలన్నారు. అయితే సుప్రీం కోర్టులో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానానిదేనని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాదిరిగానే ప్రభుత్వంలో ప్రధాన మంత్రి అత్యంత కీలకమైన వ్యక్తి అని, ఈ నేపథ్యంలో ఆయన సహచరులు ఎలాంటి సమస్య తలెత్తినా తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఇలాంటి పరిస్థితి కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు సంకేతమేనని పేర్కొన్నారు. ప్రస్తుత న్యాయ సంక్షోభంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదన్న వాదనను ఆయన తిరస్కరించారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులే మీడియా ముందుకు వచ్చి తమ మనోభావాలను వెల్లడించిన నేపథ్యంలో ఈ సంక్షోభం ఎంతమాత్రం సుప్రీం కోర్టుకే పరిమితమైనది కాదని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆందోళనను, అభిప్రాయాన్ని సహేతుకంగా వ్యక్తీకరించాలని, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులున్నాయంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు, అటు పార్లమెంట్ ఉదాసీనంగా ఉండడానికి వీలులేదని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావించిన సిన్హా, ఇంత స్వల్ప వ్యవధిపాటు పార్లమెంటు సమావేశాలు జరగడం తానేప్పుడూ చూడలేదని, ఇది కూడా ప్రజాస్వామ్యానికి ముప్పేనని తెలిపారు.