జాతీయ వార్తలు

పాక్‌పై ఉక్కు పిడికిలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: జమ్ము కాశ్మీర్‌లో సుస్థిర శాంతిని పాదుగొల్పాలంటే రాజకీయ ప్రయత్నాలతోపాటు సైనిక ఆపరేషన్లు కూడా చేదోడు వాదోడుగా కొనసాగాల్సిన అవసరం ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. రాజకీయంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించే చర్యలను వేగవంతంగా చేపట్టడం ఎంత అవసరమో, అదే స్థాయిలో మిలిటెన్సీ అవరోధం కాకుండా దాన్ని అణచివేయడమూ అంతే అవసరమని ఆదివారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో రావత్ తెలిపారు. పాకిస్తాన్‌పై మరింతగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి, చొరబాట్లకు పూర్తిస్థాయిలో తెరదించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే రాష్ట్రంలో సైనిక కార్యకలాపాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని, ఆయా పరిస్థితులను బట్టి సవాళ్లు, స్థితిగతులను బట్టి సైన్యం కూడా తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని రావత్ వెల్లడించారు. ఏడాది క్రితం తాను ఆర్మీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి పరిస్థితులతో పోలిస్తే నేటి పరిస్థితులు ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయాలంటూ ఇటీవలి తరహాలోనే పాకిస్తాన్‌పై అన్ని విధాలుగానూ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఏరివేసే విషయంలో కఠినంగా వ్యవహారించాలన్న సైనిక విధానంలో ఎలాంటి మార్పు లేదని, అయితే రాజకీయ కార్యకలాపాలు కూడా ఏకకాలంలో సాగితే రాష్ట్రంలో సుస్థిర శాంతిని పాదుగొల్పడం అసాధ్యమేమీ కాదన్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి రాజకీయ-సైనిక వ్యూహంతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాశ్మీర్ వేర్పాటువాదలతోనూ, సంబంధిత వర్గాలతోనూ చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో మాజీ ఐబి చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించిన విషయం తెలిసిందే. దినేశ్వర్ శర్మ ప్రభుత్వ ప్రతినిధిగా కాశ్మీర్ ప్రజలతో మాట్లాడుతున్నారని, వారి మనోభావాలను తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా వెల్లడించిన రావత్, మిలిటెన్సీ అణచివేత విషయంలో తమదైన పంథాలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పాకిస్తాన్‌పై నిరంతరం ఒత్తిడి తేవడం ద్వారానే ఉగ్రవాద చొరబాట్లను అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్న ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితులు, సవాళ్లు మారుతున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగానే సైనిక దళాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలన్నారు. గత కొన్ని నెలలుగా కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైన్యం గట్టి చర్యలు చేపడుతోందని, అలాగే ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ అన్న రీతిలో అధీనరేఖ వద్ద కూడా పాకిస్తాన్ ఆట కట్టిస్తోందని రావత్ అన్నారు.