జాతీయ వార్తలు

ఆహ్వానం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆరు రోజుల చారిత్రక, ప్రత్యేక పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. తనకు సన్నిహిత మిత్రుడైన నెతన్యాహూను ఆహ్వానించేందుకు ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి మరీ మోదీ ఆయనను ఆలింగనం చేసుకుని భారత గడ్డపైకి ఆహ్వానించారు. ఈ ఆరు రోజుల పర్యటనలో భాగంగా ముంబయి, గుజరాత్‌లను కూడా నెతన్యాహూ సందర్శిస్తారు. తన భార్య సారా సమేతంగా నెతన్యాహూ విమానం దిగి రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన వెంటనే చిరుదరహాసంతో ఎదురేగిన మోదీ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. నెతన్యాహూ, ఆయన భార్యతో కరచాలనం చేశారు. ప్రోటోకాల్‌కు భిన్నంగా నరేంద్ర మోదీ తమకు పలికి ఆహ్వానం ఆనందదాయకంగా ఉందంటూ నెతన్యాహూ వ్యాఖ్యానించినట్లు జెరూసలెం పోస్ట్ తెలిపింది. భారత పర్యటనకు బయలుదేరే ముందు మాట్లాడిన నెతన్యాహూ ‘ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశం భారత్. ఇరు దేశాలు అన్ని రంగాల్లోనూ సన్నిహితమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల భద్రత, ఆర్థిక, వాణిజ్య, టూరిజంతోపాటు ఎన్నో రకాలుగా ఉభయతారకమైన రీతిలో ప్రయోజనాలు సిద్ధిస్తాయి’ అని తెలిపారు. తన మిత్రుడైన నెతన్యాహూకు ఆహ్వానం పలకడానికి మోదీ ఎదురేగి వెళ్లారంటే ఇజ్రాయెల్‌తో భారత్‌కు ఉన్న అనుబంధానికి, లోతైన సంబంధాలను పెంపొందించుకోవాలన్న ఆకాంక్షకు అద్దం పడుతోందని విదేశాంగ వ్యవహార శాఖకు చెందిన రవీశ్ కుమార్ అన్నారు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య లాంచనంగా సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెతన్యాహూ ఇక్కడికి రావడం సముచితమైన సందర్భమని పేర్కొన్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఆరియల్ షెరాన్ భారత్ వచ్చారు. ఆ తర్వాత భారత్‌లో అడుగిడిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధాని భారత్ రావడం ఓ చారిత్రక, ప్రత్యేక ఘట్టమని నెతన్యాహూకు ఆహ్వానం పలికిన తర్వాత ఓ ట్వీట్‌లో మోదీ అన్నారు. ఆయన రాకవల్ల ఇరుదేశాల మైత్రీ బంధం మరింతగా ఇనుమడిస్తుందని పేర్కొన్నారు. కాగా, నెతన్యాహూతో మోదీ జరిపే చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిస్థితులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. వీరంతా ఇటు ముంబయి, అటు గుజరాత్‌లో విస్తృత స్థాయిలో వ్యాపార, వాణిజ్యపరమైన చర్యలు జరుపుతారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా నెతన్యాహూ సందర్శించే అవకాశం ఉంది.

చిత్రం..భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో నరేంద్ర మోదీ