జాతీయ వార్తలు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా ఆజాద్, కమలనాథన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కమల్‌నాథ్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం వీరిద్దరిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడయిన ఆజాద్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జిగా, కమల్‌నాథ్ పంజాబ్, హర్యానాల ఇన్‌చార్జిగా నియమితులయినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది చెప్పారు. వచ్చే సంవత్సరం తొలినాళ్లలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మధుసూదన్ మిస్ర్తి ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను, షకీల్ అహ్మద్ పంజాబ్, హర్యానా వ్యవహారాలను చూస్తూ వచ్చారు. ఎఐసిసి కార్యదర్శివర్గం పునర్ వ్యవస్థీకరణకు పూర్వరంగంగా ఆదివారం నాటి నియామకాలు జరిగినట్లు కనపడుతోంది. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆజాద్, కమలనాథన్‌ల నియామకం జరిగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడటం, ఉత్తరప్రదేశ్‌లో కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం, హర్యానాలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూరితంగా తప్పు చేసినట్లు ఆరోపణలు రావడం, ఫలితంగా 14 మంది ఓట్లు చెల్లకుండా పోవడంతో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఆర్.కె.ఆనంద్ ఓడిపోయిన మరుసటి రోజే సోనియా గాంధీ.. ఆజాద్, కమలనాథన్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించి, ఆ రెండు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.