జాతీయ వార్తలు

మీకు సంబంధం ఏమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: బోఫోర్స్‌లో 64 కోట్ల రూపాయల చెల్లింపుల ఘటనకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుతో మీకు సంబంధం ఏమిటని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. 2005 మే 31న ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయాన్ని గుర్తుచేసిన బెంచ్ దీనిపై సీబీఐ సవాల్ చేయలేదని పేర్కొంది. ‘ఈ కేసుతో మీకేంటి సంబంధం. మీకున్న అర్హత ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వచ్చేవాయిదా రోజున మీ వాదన వినిపించాలంటూ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎం ఖన్వీకర్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. ఫిబ్రవరి 2కు విచారణ వాయిదా వేశారు. బోఫోర్స్ చెల్లింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న హిందుజా సోదరులు, శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ చంద్‌లను నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2005 మే 31న జస్టిస్ ఆర్‌ఎస్ సోధీ ఈ తీర్పును ఇచ్చారు. ఈ కేసును సీబీఐ విచారించింది. ఇలా ఉండగా హైకోర్టు తీర్పును బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. అజయ్ ఎవరంటే.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ చేసిన వ్యక్తి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసింది. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారత్- స్వీడన్ కంపెనీ మధ్య 1,437 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న భారత్‌లోని రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టినట్టు స్వీడిష్ రేడియో ప్రకటించింది. పలువురు రక్షణశాఖ అధికారులకు ముడుపులు అందాయని సంచలన ప్రకటన చేసింది. 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. బోఫోర్స్ కంపెనీ ఎండీ మార్చిన్ ఆర్డ్‌బో, మధ్యవర్తి విన్ చద్దా, హిందుజా సోదరులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.