జాతీయ వార్తలు

గణతంత్ర వేడుకల్లో ‘ఆసియాన్’ నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా ‘ఆసియాన్’ దేశాల జానపద నృత్యాలు ఆహూతులను అలరించనున్నాయి. ‘ఆసియాన్’ సభ్య దేశాలతో భారత్ సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసేందుకు ఈ నృత్య ప్రదర్శనలను తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవంలో 770 మంది విద్యార్థులు కథక్‌తో పాటు కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, లావోస్, బ్రూనై దేశాలకు చెందిన జానపద నృత్యరీతులను ప్రదర్శించేందుకు ఘనంగా సన్నాహాలు చేస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఈసారి ముఖ్య అతిథులుగా ‘ఆసియాన్’ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఢిల్లీలోని వౌంట్ అబూ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 150 మంది విద్యార్థులు పది దేశాలకు చెందిన సంప్రదాయ దుస్తులను ధరించి కళా ప్రదర్శనల్లో పాల్గొంటారు. మరికొందరు విద్యార్థులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆసియాన్ దేశాలతో భారత్‌కు ఉన్న పాతికేళ్ల బంధాన్ని గుర్తుకు తెచ్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఫిలిప్పీన్స్, మలేషియా తదితర దేశాల జానపద కళారూపాలను వివిధ దేశాధినేతల సమక్షంలో తాము ప్రదర్శించనుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వౌంట్ అబూ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు చెబుతున్నారు. వీడియోల ద్వారా ఆ కళారూపాలను నేర్చుకునేందుకు నెల రోజులుగా తాము శిక్షణ పొందుతున్నామని వారు తెలిపారు.
ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని సాంస్కృతిక కేంద్రాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా గణతంత్ర వేడుకల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. జహాన్‌గిర్‌పురి (్ఢల్లీ)లోని రాణీ చెన్నమ్మ సర్వోదయ కన్యా విద్యాలయకు చెందిన విద్యార్థినులు ‘్భరత్ కే రంగ్’ పేరిట తొలి ప్రదర్శన ఇస్తారు. నజాఫ్‌గఢ్‌లోని ఆక్స్‌ఫర్డ్ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు ‘శిక్షిత్ భారత్, సశక్త్ భారత్’ పేరిట ప్రదర్శన ఇస్తారు. సౌత్ సెంట్రల్ జోన్‌లోని పేద వర్గాలకు చెందిన విద్యార్థులు, ఢిల్లీలోని జహాన్‌గిర్‌పురి ప్రాంత మురికావాడల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలకు తర్ఫీదు పొందుతున్నారు.

చిత్రం..రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీలో బైక్‌లపై రిహార్సల్స్ చేస్తున్న మహిళా బీఎస్‌ఎఫ్ (డేర్ డెవిల్స్) జవాన్లు.