జాతీయ వార్తలు

కొత్త ఆలోచనలతో సాగుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 12: కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు, విధానాల బలంతో మారుతున్న కాలానికి అనుగుణంగా బిజెపి తనను తాను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ మొదలైన బిజెపి రెండు రోజుల జాతీయ సదస్సులో కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ప్రస్తుత పరిస్థితులను బట్టి పార్టీలో అంతర్గతంగా మార్పులు రావడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందంటూ మధుర, కైరానా సంఘటనలు ఉదహరించారు. ఈ హింసాత్మక వాతావరణం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం రోజురోజుకూ నిస్సహాయ స్థితిలో పడిపోతోందని, క్షీణిస్తున్న పరిస్థితులను ఎదుర్కోలేక పోతోందని అన్నారు. మధుర, కైరానా సంఘటనల పర్యవసానంగా అనేక కుటుంబాలు ఆయా ప్రాంతాల నుంచి తరలిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ అండతో ప్రభుత్వ భూములనే కబ్జా చేయడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజార్టీ సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేసిన షా ఇందుకు వీలుగా పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలన్నారు. బిజెపి సీనియర్ నేతలు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. 2017 సంవత్సరం అనేక రకాలుగా బిజెపికి సవాళ్ల మయమని, ఉత్తర ప్రదేశ్, ఉతరాఖండ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో జరుగనున్న ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. కాగా, దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో అభివృద్ధి లేక పోవడం, శాంతి భద్రతలు క్షీణించడం జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే విషయమని ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ సమావేశం వివరాలను వెల్లడించిన ఆయన ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌పైనే దృష్టి పెట్టామన్నారు.

చిత్రం అలహాబాద్‌లో ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మోదీ, జైట్లీ, అమిత్‌షా, అద్వానీ