జాతీయ వార్తలు

అగ్ని-5 క్షిపణి పరీక్ష సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తినియలు చేయగలగే అణు సామర్థం కలిగిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ గురువారం ఉదయం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవిలో ఉదయం 9.53కు ఈ ప్రయోగం జరిగింది. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుగల ఈ క్షిపణి బరువు50 టన్నులు. టన్నుకు పైగా బరువైన అణ్వాయుధాన్ని దీని ద్వారా ప్రయోగించవచ్చు. దీర్ఘశ్రేణి లక్ష్యాలను చేధించే సామర్ధ్యం సంతరించుకునే లక్ష్యంతో అగ్ని క్షిపణులు సిరీస్‌ను భారత్ చేపట్టింది. దీని తొలి పరీక్ష 2012 ఏప్రిల్ 19న జరిగింది. తరువాత 2013, 15, 16 సంవత్సరాల్లో కూడా ఆ అణు క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు ఐదో ప్రయోగ పరీక్ష కూడా విజయవంతం కావడంతో భారత్ సైనిక పాటవం మరింత ఇనుమడించినట్టయింది. ఈ ప్రయోగ అనంతరం మాట్లాడిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌‘ అగ్ని పరీక్ష విజయవంతమైంది’అని వ్యాఖ్యానించారు. ఈ బాలిస్టిక్ క్షిపణికి అవసరమైన వౌలిక టెక్నాలజీని తమిళనాడు నుంచి పొందినట్టు ఆమె వెల్లడించారు. ఈ ప్రయోగ విజయం వల్ల దేశీయ క్షిపణి సారధ్యం నిరోధక శక్తి మరింతగా పెరిగాయని అన్నారు. భారత క్షిపణి వ్యవస్థలో అగ్నిది మధ్యంతర బాలిస్టిక్ శ్రేణి. మొత్తం అగ్ని 1,2,3,4,5 క్షిపణులను భిన్న సామర్ధ్యంతో ఇప్పటి వరకూ పరీక్షించారు. అగ్ని-5 అంతర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అణ్వాయుధాలను ప్రయోగించే లక్ష్యంతోనే దీన్ని రూపొందించారు.