జాతీయ వార్తలు

రైలు టికెట్లపై డిస్కౌంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: విమాన ప్రయాణికుల్లాగే రైళ్లలోనూ అడ్వాన్స్ బుక్కింగ్ టికెట్లకు డిస్కౌంట్‌లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ధరల రివ్యూ కమిటీ సిఫార్సులను రైల్వే బోర్డుకు పంపింది. బోర్డు ఆమోదం కూడా లభించినట్టు తెలిసింది. రైళ్లలో సీట్ల అందుబాటును బట్టి డిస్కౌంట్లు అమలుచేయాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం డిస్కౌంట్ల విధానం విమాన సర్వీసుల్లో జోరుగానే నడుస్తోంది. కొన్ని నెలల ముందే బుక్ చేసుకున్న టికెట్లకు భారీగానే డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇప్పుడీ విధానం రైల్వేల్లోనూ ప్రవేశపెట్టాలని బోర్డుకు నివేదించారు. టికెట్ల బుకింగ్ సమయానికి అందుబాటులో ఉన్న సీట్లపై 50 నుంచి 20 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే రిజర్వేషన్ల చార్ట్ తయారైపోయిన తరువాత కూడా సీట్లు ఖాళీగా ఉంటే డిస్కౌంట్ ఇవ్వాలన్నది ఓ ప్రతిపాదన. రెండు రోజులు అలాగే రైలు బయలుదేరడానికి రెండు గంటల ముందూ మిగిలిన టికెట్లకు డిస్కౌంట్ సదుపాయం కల్పించాలని రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది. కాగా లోయర్‌బెర్త్ కోరుకున్న ప్రయాణికులు అదనంగా చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం విమానాల్లో కొనసాగుతోంది. విమానాల్లో ముందు సీట్లు కావాలనుకుంటే అదనపుచార్జి చెల్లిస్తున్నారు. ఇప్పుడీ విధానం రైల్వేల్లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అయితే గర్భిణిలు, వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే లోయర్‌బెర్త్‌లు ఇస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రైలు చార్జీలు పెంచుకోవచ్చని కమిటీ పేర్కొంది. అంటే ఆడ్ అవర్స్- ఉదాహరణకు 00.00-04.00 అలాగే 13.00-17.00 గంటల మధ్య నడిచే సర్వీసులకు సంబంధించి చార్జీలు పెంపును కమిటీ సమర్థించింది. కమిటీ సిఫార్సులకు కొన్ని సవరణలు, మార్పులు తరువాతే బోర్డు ఆమోదం లభిస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. స్థానికుల డిమాండ్, రైళ్ల అందుబాటు, చార్జీల్లో వ్యత్యాసాన్ని జోనల్ స్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పండగల సీజన్లో చార్జీలు పెంచుకోవచ్చని రివ్యూ కమిటీ మరో ప్రతిపాదన చేసింది. రద్దీలేని రోజుల్లో ధరలు చార్జీలు తగ్గించుకునే విషయాన్ని పరిశీలించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ప్యాంట్రీ కార్లు ఉన్న రైళ్లు, రాత్రి పూట నడిచే రైళ్లలో ప్రీమియం చార్జీలను కమిటీ ప్రతిపాదించింది. నీతీ అయోగ్ సలహాదారు రవీందర్ గోయల్, ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవిన్యూ మేనేజ్‌మెంట్) మీనాక్షి మాలిక్, ప్రొఫెసర్ ఎస్ శ్రీరామ్, రెవెన్యూ డైరెక్టర్ మణి, రైల్వే బోర్డు అధికారులు కమిటీలో ఉన్నారు.