జాతీయ వార్తలు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బాంబే హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను నిర్దోషిగా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై పైకోర్టుకు వెళ్లేలా సీబీఐని ఆదేశించాలంటూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ముంబయి నగరానికి చెందిన న్యాయవాదుల సంఘం శుక్రవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ దేశంలో సంచలనం సృష్టించింది. ఎంతో ప్రాధాన్యతగల ఈ కేసు నుంచి అమిత్‌షాకు విముక్తి కలిగించినా సీబీఐ పైకోర్టులో అప్పీల్ చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు. షాను నిర్దోషిగా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ వేసేలా సీబీఐను ఆదేశించాలని పిల్‌లో అభ్యర్థించారు. లాయర్ల అసోసియేషన్ తరఫున అడ్వొకేట్ అహ్మద్ అబిదీ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, జస్టిస్ భారతి దంగ్రేతో కూడిన ధర్మాసనం ఈనెల 22న పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.‘సీబీఐ దేశంలోని అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ. సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ వంటి కీలకమైన కేసును దర్యాప్తుచేయడం సీబీఐ విధి. చట్టం ముందు అందరూ సమానులేనన్న సంగతి గుర్తెరగాలి’అని పిటిషనర్ అన్నారు. అమిత్‌షాతో పాటు రాజస్థాన్ సబ్‌ఇన్‌స్పెక్టరు హిమాన్షు సింగ్, శ్యామ్‌సింగ్ చరణ్, గుజరాత్ పోలీసు సీనియర్ అధికారి ఎన్‌కే అమిన్‌లను విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో ఉటంకించారు. ఉగ్రవాది అన్న అనుమానంతో సోహ్రాబుద్దీన్‌ను గుజరాత్, రాజస్థాన్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సోహ్రాబుద్దీన్ షేక్ భార్య కౌసర్‌బీ, అతడి అనుచరుడు తులసీ ప్రజాపతి ఎన్‌కౌంటర్ అయ్యారు. 2005లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 2010 ఫిబ్రవరిలో కేసు దర్యాప్తును పూర్తిచేసిన సీబీఐ అదే ఏడాది జూలైలో చార్జిషీట్ దాఖలు చేసింది. 23 పేర్లను చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అమిత్‌షా అప్పట్లో గుజరాత్ రాష్ట్ర హోమ్‌మంత్రిగా ఉన్నారు. తరువాత ట్రయల్ కోర్టు అమిత్‌షా, మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను నిర్దోషులుగా ప్రకటించింది. పలువురు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.