జాతీయ వార్తలు

కళ్ల ముందున్న సాక్ష్యాల్ని కాదంటారా?: భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్ కరడుకట్టిన నేరస్థుడని తాము సాక్ష్యాలు చూపించినా పాకిస్తాన్ కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందని భారత్ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సరుూద్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. ‘ఓ వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తున్నారంటే అందుకు తగినన్ని సాక్ష్యాధారాలు తప్పక ఉంటాయి.. అయితే, ఏమీ జరగడం లేదని పాకిస్తాన్ కళ్లు మూసుకుంటోంది.. కళ్ల ముందున్న సాక్ష్యాలను గమనిస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయి.. మీ (పాకిస్తాన్) భూభాగం నుంచి ఉగ్రవాద చర్యలకు వ్యూహరచన చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు?..’ అని ఆయన ప్రశ్నించారు. తమ దేశంలో సరుూద్‌పై ఎలాంటి కేసులు లేనందున అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పాక్ ప్రధాని అబ్బాసీ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం పట్ల భారత్ స్పందించింది. అబ్బాసీ వ్యాఖ్యలను అమెరికా సైతం కొట్టిపారేస్తూ, ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన సరుూద్‌పై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించి, సరుూద్‌పై చర్యలకు పాక్ ఇకనైనా ఆదేశాలు జారీ చేయాలన్నారు.