జాతీయ వార్తలు

గర్భిణీని వదలని కామాంధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదౌన్ (యూపీ), జనవరి 20: ముప్ఫైరెండేళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన యూపీలోని కచులా గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ చంద్రప్రకాశ్ తెలిపారు. చాలాసేపటి వరకు ఆ మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకడం ప్రారంభించారు. సమీపంలో అటవీ ప్రాంతంలో ఆ గర్భిణి నడవలేని స్థితిలో పడివుండడాన్ని గమనించి ఆమెను బరేలీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.