జాతీయ వార్తలు

చైనాను దాటేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: అంతర్జాతీయ స్థాయిలో హోరాహోరీగా ముందుకు సాగుతున్న భారత్-చైనాల మధ్య కొత్త సంవత్సరంలో ఈ పోటీ అన్నది కొత్త మలుపు తిరగబోతోంది. ఇప్పటివరకూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాను భారత్ అధిగమించబోతోందంటూ తాజాగా ఓ అధ్యయన నివేదికలో వెల్లడైంది. అలాగే ప్రపంచంలోనే భారత ఈక్విటీ మార్కెట్ ఐదో స్థానానికి చేరుకోబోతోందని, ఆ విధంగా మరో మైలురాయిని కూడా భారత్ దాటబోతోందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచంలో అనేక దేశాలు వృద్ధిమాంద్యం, వ్యవస్థాగత మార్పులకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతుంటే భారత్ అందుకు భిన్నంగా అత్యంత వేగంగా ఆర్థిక సంస్కరణలను అమలుచేయబోతోందని, ఆ విధంగా బలమైన దీర్ఘస్థాయి వృద్ధి రేటును సముపార్జించుకుంటోందని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ అనే సంస్థ తెలిపింది.
రానున్న కొన్ని నెలల వ్యవధిలోనే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరించడంతోపాటు అత్యంత వేగంగా వృద్ధి రేటును సంతరించుకుంటూ అభివృద్ధినీ సాధిస్తూ చైనాను భారత్ దాటేస్తుందని ఈ నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలు 2-3 శాతం వృద్ధిరేటు మధ్య కొట్టుమిట్టాడుతుంటే భారత్ 7.5 శాతం వృద్ధి రేటే లక్ష్యంగా పరుగులు తీస్తోందని తెలిపింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మరో కీలకమైన మార్పు వినియోగదారుడే ధరలను నియంత్రించే పరిస్థితి ఉండడం. అంటే ఆ విధంగా మార్కెట్ ధరలను తమ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకునే సత్తాను భారత వినియోగదారుడు సంతరించుకున్నాడని తెలిపింది.