జాతీయ వార్తలు

మోదీ జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 12: బంగ్లాదేశ్‌లో హిందువులపై వరసగా దాడులు జరుగుతున్న దృష్ట్యా తమ భద్రతకోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం ఈ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ‘బంగ్లాదేశ్‌లో అతిపెద్ద మైనారిటీ తెగ అయిన హిందువులు దాడులకు గురవుతున్నారు. మత ఛాందసవాదులు, జమాత్ శక్తులు బంగ్లాదేశ్‌నుంచి హిందువులను పూర్తిగా తుడిచిపెట్టాయలనుకుంటున్నాయి. హిందూ మెజారిటీ దేశమైన భారత్ దీనిపై ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోదీపై మేము ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం ఆయన చొరవ తీసుకుని ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హిందువులకు భద్రత కల్పించాలి’ అని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన రాం దాస్‌గుప్తా పిటిఐతో అన్నారు.
ఈ నెల 10వ తేదీన అరవై ఏళ్ల హిందూ ఆశ్రమ కార్యకర్త నిత్యరంజన్ పాండేను ఇస్లామిక్ మిలిటెంట్లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో సెక్యులర్ వాదులపై వరసగా జరుగుతున్న దాడుల్లో చనిపోయిన నాలుగో వ్యక్తి ఆయన. మెజారిటీ ముస్లింలు, మత ఛాందసవాద ముఠాలు హిందువులను తుడిచిపెట్టాలని అనుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ దాడులు తీవ్రమైనాయి.