జాతీయ వార్తలు

భద్రతాదళాల కాల్పులు.. ఇద్దరు పౌరుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 27: హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు జరపగా ఇద్దరు పౌరులు మరణించిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో శనివారం జరిగింది. భద్రతా దళాలకు చెందిన వాహన శ్రేణిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గనొవ్‌పుర గ్రామం వద్ద సైనికుల వాహనాలను స్థానికులు అడ్డుకుని రాళ్ల వర్షం కురిపించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు సైనికులు కాల్పులు జరిపారు. నిరసనకారుల్లో పలువురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన జావైద్ అహ్మద్ భట్, సుహైల్ జావిద్ లోనె అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు యువకులు మరణించడంతో గనొవ్‌పుర తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.