జాతీయ వార్తలు

జవాన్లపై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 28: జమ్మూకాశ్మీర్‌లో శనివారం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షోపియాన్ జిల్లా గనౌపూరా ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై స్థానికులు కొందరు రాళ్లదాడికి పాల్పడిన సందర్భంలో ఆత్మరక్షణ కోసం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు మేజర్ ర్యాంక్ అధికారిపైనా 10 గర్వాల్ యూనిట్‌పైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఆర్మీ జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార వాణిజ్య కేంద్రాలు, షాపులు మూతబడ్డాయి. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.
షోపియాన్ జిల్లాలోని జైనాపూరా ప్రాంతంలో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో గులామ్ నబీ (55), జుబైర్ అహ్మద్ (18), ఉమర్ ఫరూఖ్ (19) ఉన్నారు. వెంటనే వారిని అనంతనాగ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..ఆదివారం జమ్మూకాశ్మీర్ బంద్‌తో నిర్మానుష్యమైన శ్రీనగర్‌లోని ఓ ప్రధాన వీధి