జాతీయ వార్తలు

ప్యాకేజీకి చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఈ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టీడీపీ లోక్‌సభా పక్షం నాయకుడు తోట నర్సింహం తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీల ఎంపీలతో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ తోట నర్సింహం హాజరయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఏపీకి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలుకీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు తగిన విధంగా సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం త్వరితగతిన నిధులు విడుదల చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఈ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. కేంద్రానికి తమ పార్టీ అన్ని విషయాల్లోను కేంద్రానికి సహకారం అదిస్తోందని తోట నర్సింహం తెలిపారు.