జాతీయ వార్తలు

కాస్‌గంజ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్‌గంజ్, జనవరి 28: రెండురోజుల పాటు అల్లర్లతో అట్టుడికి కాస్‌గంజ్ పట్టణంలో ప్రశాంతత ఏర్పడింది. ఆదివారం జిల్లా అధికారులు శాంతి కమిటీ సమావేశానికి ఏర్పాటు చేసి, అందరూ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వీహెచ్‌పీ, ఏబీవీపీ నిర్వహించిన బైక్ ర్యాలీపై రాళ్ల దాడి అనంతరం అల్లర్లతో కాస్‌గంజ్ ప్రాంతం అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. శాంతి కమిటీ సమావేశం అనంతరం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు యధావిధిగా పనిచేశాయి. అల్లర్లకు పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని ఆగ్రా ఏడీజీ అజయ్ ఆనంద్ తెలిపారు.
విచారణ జరిపించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘర్షణల్లో ఒక యువకుడు మరణించగా, మూడు షాపులు, రెండు ప్రైవేటు బస్సులు, ఒక కారును ఆందోళనకారులు తగులబెట్టారు. అలర్లకు స్థానిక అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.