జాతీయ వార్తలు

సీనియర్లే మెంటార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 28: కొత్త సారథి, కొత్త రక్తంతో కాంగ్రెస్ పూర్వవైభవం సంతరించుకుంటోందని చెప్పడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కటిచాలని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలో కొత్త రక్తాన్ని నింపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో, సీనియర్లు కొత్తతరానికి సలహాదారులుగా ఉండాలేతప్ప నొప్పించేవాళ్లలా కాదన్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత పార్టీ పూర్తిస్థాయి సారథ్యం స్వీకరించిన రాహుల్ కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని తెస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ‘పార్టీ సీనియర్లు కొత్తతరానికి గైడ్ కావాలి. వాళ్లను నొప్పించకుండా ముందుకు నడిపించాలి. సీనియర్లు ఇప్పటికే ఎంతో ప్రపంచాన్ని చూశారు. పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. అలాంటి అవకాశం కొత్తతరానికీ అందించాలి’ అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరాం అభిప్రాయపడ్డారు. కోల్‌కతాలో టాటా స్టీల్ నిర్వహించిన సాహితీ సభకు హాజరైన పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాంరమేష్ పార్టీ వ్యవహారాలపై నిశ్చితాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి సీనియర్లు మరింత వృద్ధులైపోతున్నారు కదా? అన్న ప్రశ్నకు ‘సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింథియా, గౌరవ్ గొగోయ్, సుష్మితా దేవ్‌లాంటి యువరక్తం లేదా? వాళ్లను తెరమీదకు తెస్తున్నాం’ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలాన్ని ప్రస్తావిస్తూ ‘పార్టీ పూర్వ వైభవానికి ఇదో సంకేతం. గుజరాత్‌లో 41శాతం ఓట్లు సాధించాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నామని చెప్పడానికి ఇదోక సంకేతం. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. వచ్చే గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. బీజేపీ మాదిరిగా కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చే ఆలోచన కాంగ్రెస్‌కు లేదు’ అన్నారు. ‘గుజరాత్ ఎన్నికలకు ముందు రాహుల్ వేరు. ఇప్పుడు వేరు. కాంగ్రెస్‌కు ఇప్పుడాయన పూర్తిస్థాయి సారథి’ అని జైరాం గుర్తు చేశారు. ‘వాస్తవానికి గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ పడరాని కష్టాలుపడ్డారు. అదిచాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను చూసి బీజేపీ ఎంత కంగారుపడుతుందో చెప్పడానికి’ అంటూ వ్యంగ్యబాణాలు సంధించారు. ‘గుజరాత్‌లో రాహుల్‌గాంధీ నిర్మాణాత్మకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు అద్భుతం. అదేస్థాయిలో కార్నాటక అసెంబ్లీ ఎన్నికలకూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని అనుకుంటున్నా. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని చెప్పడానికి నాకైతే ఒక్క కారణం కూడా కనిపించటం లేదు’ అన్నారు. మోదీ, అమిత్‌షా వంటి వాగ్దాటి కలిగిన నేతలను ఎదుర్కొవడానికి సమర్థులైన నేతల అవసరమైతే పార్టీకి ఉందని అభిప్రాయపడ్డారు. ‘వాజపేయి సారథ్యంలోని బీజేపీకి, మోదీ, అమిత్‌షాల సారథ్యంలోని బీజేపీకి చాలా వ్యత్యాసముంది. స్వార్థంతో సమాజం, సంస్కృతికి తీరని నష్టం చేకూరుస్తున్నారు’ అని విమర్శించారు. ‘నేను ఇంతవరకూ చూసిన వాళ్లలో మోదీలాంటి అతిపెద్ద షోమాన్‌ను ఎక్కడా చూడలేదు.. మోదీ ఉపన్యాసాలన్నీ బోగస్. కానీ నమ్మించటంలో ఆయన దిట్ట’ అన్నారు. ‘అధికారంలో ఉన్నపుడే కాదు, ప్రతిపక్షంలోనూ కాంగ్రెస్ సమర్థవంతమైన పాత్ర పోషించింది. నిజానికి 2014 సాధారణ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ సీరియస్ క్రైసిస్‌ను ఎదుర్కొంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మోదీకంటే ఉత్తమోత్తమ నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నాడు. సెక్యులర్ పార్టీలను కలుపుకుని బీజేపీని సమర్థంగా ఎదుర్కోడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది’ అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.