జాతీయ వార్తలు

గాంధీ సిద్ధాంతాలు నేటికీ శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే గాంధీజీ సిద్ధాంతాలే శిరోధార్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ‘దక్షిణాఫ్రికాలో మహోత్మోదయం’ పేరుతో డా.యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రచించిన హిందీ, తెలుగు గ్రంథాల ఆవిష్కరణ భారత దౌత్య కార్యలయంలో వివిధ సాంస్కృతిక సంస్థల సంయుక్త సారధ్యంలో లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ గాంధీజీ భారతదేశ స్వాతంత్య్రంకోసం చేసిన పోరాటం, ఆయన సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. యార్లగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వచ్చిన గాంధీజీని తెల్లవారు అర్ధనగ్న ఫకీర్ అని అవహేళన చేశారని అన్నారు. లండన్ నగర నడిబొడ్డున ఇప్పుడు గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించుకుని వాళ్లే పూజిస్తున్నారంటే గాంధీ సిద్ధాంతాల విలువ ఏమిటో తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.