జాతీయ వార్తలు

ఆర్థిక భవిత ఉజ్వలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలాన్ని పుంజుకుంటోందని జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుని 7 నుంచి 7.5 శాతం వృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 2018-19 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత వేగంతో ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ఈ సర్వే వెల్లడించింది. అయితే చమురు ధరల పెరుగుదల, స్టాక్‌మార్కెట్ తీరుతెన్నుల ద్వారా కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తెలిపింది. మరో రెండు రోజుల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం తన ఐదో, చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశే్లషిస్తూ, భవిష్యత్ అవకాశాలు కళ్లకు కడుతూ ఈ సర్వే రూపుదిద్దుకుంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతూ ఆర్థిక వ్యవస్థ క్రమానుగతంగా బలపడుతూ వస్తోందని ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు 6.75 శాతం మేర ఉండొచ్చని సర్వే తెలిపింది. రానున్న ఆర్థిక సంవత్సంలో ఎగుమతులు అదే విధంగా ప్రైవేటు పెట్టుబడులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల వేసిన 6.5 శాతం వృద్ధిరేటు అంచనాకంటే కూడా ఈ ఆర్థిక సర్వే అంచనాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. 2016-17 ఆర్థిక సంవత్సంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం అయితే అంతకు ముందు ఏడాది 8 శాతంగా నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సంరలో జీడీపీ 7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరలో వృద్ధి రేటుపై జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని చెప్పడానికి అనేక అంశాలు తార్కాణంగా నిలుస్తున్నాయని 2019 మేనెలకు ముందుజరిగే సాధారణ, అసెంబ్లీ
ఎన్నికల్లోగానే ఈ ఆర్థిక ఫలితాలు అందుకోవచ్చని అరవింద్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ముఖ్యంగా ఎగుమతులు పెరిగితే 7.5 శాతం ఆర్థిక వ్యవస్థ అందుకునే అవకాశాలు ప్రస్పుటంగా ఉన్నాయని అన్నారు.
మొదట్లో జీఎస్టీ అమలు గందరోళమయంగా సాగినప్పటికీ అనంతర కాలంలో ఇబ్బందులన్నీ సమసిపోవడం ఈ కొత్త వ్యవస్థ నిలదొక్కుకోవడం అలాగే 1000,500 నోట్ల రద్దు ప్రభావం కూడా క్రమంగా సమసిపోవడం ఆర్థిక ఆశాభావ పరిస్థితులకు ఊతాన్ని ఇచ్చిందని అన్నారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సర్వే కళ్లకు కట్టిందని అదే విధంగా ఏ రకమైన సవాళ్లను ఎదుర్కోబోతున్నదీ కూడా సర్వే వివరించిందని ప్రముఖ ఆర్థికవేత్త అనీష్ చక్రవర్తి తెలిపారు. సూక్ష్మ ఆర్థిక అంశాల వల్ల కలుగుతున్న ఆందోళనల నేపథ్యంలో విధానపరమైన జాగరూకత ఎంతైనా అవసరమని ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరల్లో చోటుచేసుకునే ఒడిదుడుకులను దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలని ఈ సర్వే స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. వృద్ధి రేటుకు అనుసంధానంగా వ్యవస్థాగతమైన సంస్కరణలు కూడా వేగాన్ని పుంజుకోవాలని ఈ సర్వే పేర్కొంది. ఉపాధి, విద్య, వ్యవసాయం ఈ మూడు రంగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టి అవకాశాలను ఇనుమడింపచేయాలని దీని వల్ల మరింతగా ఆర్థిక పుష్టిపెరుగుతుందని తెలిపింది. ఉపాధి పరంగా అన్ని రకాలుగా అవకాశాలను విస్తరింపచేయాలని, మహిళలకు అవకాశాలను పెంపొందించాలని విజ్ఞప్తి చేసింది. ఇక విద్య విషయానికి వస్తే ఆరోగ్యకరమైన, విజ్ఞానయుతమైన కార్మిక శక్తిని పెంపొందించాలని తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకను పెంపొందించడంతోపాటు సమతూకాన్ని కూడా సాధించాలన్నారు.అన్ని రకాల ఒడిదుడుకులను తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని తెలిపింది. ప్రైవేటు పెట్టుబడుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టిని సారించి ఆర్థిక వృద్ధిరేటు వేగాన్ని పెంచే పరిస్థితులను ప్రభుత్వం బలోపేతం చేయాలని సర్వే స్పష్టం చేశారు.