జాతీయ వార్తలు

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తం చేశారు. కోవింద్ సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. మైనారిటీల విద్య, సామాజిక, ఆర్థిక సాధికారితకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని, బుజ్జగింపు లేని అభివృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వివరించారు. రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతి పదవిని చేపట్టిన తరువాత మొదటిసారి పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్టప్రతి వివరించారు. స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు నిర్వహించిన పాత్రను ప్రజలకు తెలియజెప్పేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కొన్ని రాష్ట్రాల్లో గిరిజన మ్యూజియంలను ఏర్పాటుచేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని ఆయన తెలిపారు. కోవింద్ తన నలభై ఐదు నిమిషాల ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రధానంగా మాట్లాడారు. భవ్య భారత నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని, ట్రిపుల్ తలాక్ బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని రాష్టప్రతి వ్యక్తం చేశారు. దీనిద్వారా ముస్లిం మహిళలు సగౌరవంగా తలెత్తుకుని జీవించవచ్చు, వారికి భయం లేని బతుకు సాధ్యమవుతుంది అని రాష్టప్రతి స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేదన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు ఈ రోజుకీ నిజమేనని ఆయన అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయటం ద్వారా సగటు మనిషికి సులభ జీవితాన్ని ప్రసాదించేందుకు కృషి చేస్తోందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కూడా సామాజిక న్యాయానికి దారి తీస్తుందనేది ఎవరైనా ఊహించారా? అని కోవింద్ ప్రశ్నించారు. ఆడపిల్లల పట్ల పేరుకుపోయిన వివక్షను తొలగించేందుకు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘్భటీ బచావ్, భేటీ పడావ్’ పథకం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది, ప్రధాన మంత్రి పంటల బీమా పథకం మూలంగా రైతులకు అత్యంత సులభంగా పంటల బీమా లభిస్తోందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించటం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని రామ్‌నాథ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలు, రైతులు పడుతున్న కష్టం మూలంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 275 మిలియన్ టన్నులు, ఉద్యానవన ఉత్పత్తులు 275 మిలియన్ టన్నులు దాటాయన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నదని రాష్టప్రతి ప్రకటించారు. ఎన్నో సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురవుతున్న 99 నీటిపారుదల పథకాల నిర్మాణం ఇప్పుడు చురుకుగా సాగుతోందని చెప్పారు. 2019 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. బీద ప్రజలు, రైతులు, వృద్ధులలో పెరుగుతున్న ఆర్థిక అభద్రతా భావాన్ని తొలగించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని రామ్‌నాథ్ చెప్పారు. ప్రభుత్వ పథకాల ఫలితాలు దేశంలోని అతి పేద ప్రజలకు చేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తోందని కోవింద్ చెప్పారు. 2022 నాటికి దేశంలోని పేద, ఇళ్లులేని వారికి ఇంటి సౌకర్యం కల్పించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి వైద్య సౌకర్యాన్ని కల్పించేందుకే ప్రభుత్వం కొత్త జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించిందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చే అన్ని సంస్థలకు ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అవినీతిపై ప్రకటించిన యుద్ధం ఇక మీదట కూడా కొనసాగుతుందని రాష్టప్రతి స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం 56 కార్మిక చట్టాలను 5కు కుదించిందన్నారు. రాష్టప్రతి ప్రసంగం ఇంగ్లీష్ అనువాదాన్ని ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు సంక్షిప్తంగా చదివారు.