జాతీయ వార్తలు

‘ట్రిపుల్ తలాక్’కు ఆమోదం తెలుపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించడం ద్వారా ముస్లిం మహిళలకు నూతన సంవత్సరం బహుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మోదీ సోమవారం బడ్జెట్ సమావేశాశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు నాలుగో నంబర్ గేట్ వద్ద విలేఖరులతో ముచ్చటించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసినా, ప్రజలు కోరుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందలేకపోయామని మోదీ విచారం వ్యక్తం చేశారు. కనీసం బడ్జెట్ సమావేశాల్లోనైనా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించటం ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని ఆయన ఉద్ఘాటించారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన బిల్లునే ఆమోదించుకోలేకపోయామని ఆయన అన్నారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ 2017 బిల్లును లోక్‌సభ ఆమోదించినా రాజ్యసభలో ఆగిపోయింది. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు దీన్ని సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేయడంతో రాజ్యసభ ఆమోదం లభించలేదు. ‘పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించేలా అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ లక్ష్య సాధన కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు. అనంతకుమార్ పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం సంపాదించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు.