జాతీయ వార్తలు

విభజన హామీలను అమలుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: విభజన సమయంలో ఉత్తరాంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉత్తరంధ్ర చర్చా వేదిక కన్వినర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యర్వంలో ఐదు రోజులపాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు జరుగుత్ను అన్యాయంపై అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో వివరించానున్నారు.
సోమవారం రాజ్‌ఘాట్ వద్ద, ఏపీ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సీపీఐ సీనియర్ నాయకుడు డి.రాజా, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో చర్చావేదిక నాయకులు కలిసి ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అనంతరం కొణతల రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ విభజన సమయంలో ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఎయిమ్స్‌ను ఉత్తరాంధ్రాకు కేటాయించాలని కొణతాల విజ్ఞప్తి చేశారు.

చిత్రం..ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా చేస్తున్న చర్చావేదిక కార్యకర్తలు