జాతీయ వార్తలు

నాలుగేళ్లలో రూ.637 కోట్ల విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలో తొమ్మిది ఎన్నికల ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు 637.54 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. 2013-14,2016-17 కాలంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక్క పార్టీకే 488.94 కోట్ల రూపాయలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 86.65 కోట్ల రూపాయల విరాళంగా దక్కాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సోమవారం ఇక్కడ వెల్లడించింది. ఐదు జాతీయ రాజకీయ పార్టీలకే 92.30 శాతం అంటే 588.44 కోట్లు విరాళాల రూపంలో దక్కాయి. ఇక 16 ప్రాంతీయ పార్టీలక కేవలం 7.70 శాతం విరాళాలు(రూ. 49.09) అందినట్టు ఏడీఆర్ పేర్కొంది. 2013-14,2016-17 సంవత్సరాల్లో బీజేపీ ఒక్కదానికే 488.94 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ)కి 86.65 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. మొత్తం తొమ్మిది ట్రస్టులకు సంబంధించిన వివరాలు ఏడీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకే ఏటా విరాళాలు అందుతున్నాయని సంస్థ వివరించింది. 2013 నుంచి ఏమేరకు విరాళాలు అందిందీ గణాంకాలు వెల్లడించింది. 2013-14లో 85.37 కోట్లు, 2014-15లో 177.40 కోట్లు, 2015-16లో 49.50 కోట్లు, 2016-17లో 325.27 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందాయి. దేశంలో మొత్తం 21 రిజిస్టరైన ఎన్నికల ట్రస్టులుండగా 14 సంస్థలు ఏఏ పార్టీకి ఎంతెంత విరాళం ఇచ్చిందీ ఎన్నికల సంఘానికి నివేదించాయి. నమోదైనప్పటి నుంచి విధిగా లెక్కలు చెబుతున్నాయని ఏడీఆర్ వివరించింది.సత్య/ప్రుడెంట్ ఎన్నికల ట్రస్టు, జనహిత్ ట్రస్టులు నాలుగేళ్లకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2016-17లో సత్య ఎన్నికల ట్రస్టు ప్రుడెంట్‌గా పేరుమార్చుకుంది. కాగా11 రిజిస్టరయిన ట్రస్టులు మాత్రం ఎలాంటి లెక్కలూ చూపలేదు. కల్యాణ్ ఎన్నికల ట్రస్టు ఒక్కసారి కూడా విరాళాల లెక్కలు వెల్లడించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈసీ వద్ద రిజిస్టరయిన పార్టీలకు తమకు వచ్చిన మొత్తం ఆదాయంలో 95 శాతం వరకూ విరాళాలు ఇచ్చేందుకు వీలుంది.