జాతీయ వార్తలు

36మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహరాంపూర్, జనవరి 29: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ప్రయాణికుల బస్సు కాల్వలోకి బోల్తాపడ్డ ఘటనలో 36 మంది మృతి చెందారు. ఘోగ్రా వద్ద వంతెన రైలింగ్‌ను ఢీకొని బస్సు కాల్వలో పడిపోయింది. దుర్ఘటనలో 36 మంది మృతి చెందగా, వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేదని స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులపై దాడికి దిగడంతోపాటు ఓ వాహనాన్ని దగ్ధం చేశారు. అలాగే అగ్నిమాపక వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. స్థానికులను చెదరగొట్టడానికి క్షతగాత్రులను ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. దౌలతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బలీర్‌ఘాట్ వద్ద ఉదయం 6 గంటల ప్రాంతలో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బస్సు నాడియా జిల్లాలోని షికార్‌పూర్ నుంచి మాల్డాకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణికులున్నారని స్థానికులు చెబుతుండగా అధికారుల మాత్రం ధృవీకరించలేదు. ప్రమాదం ఉదయం ఆరు గంటలకు జరిగినప్పటికీ సకాలంలో పోలీసులు స్పందించ లేదన్న ఆరోపణలున్నాయ. దీంతో బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయంది. సహాయక సిబ్బంది చేరుకునేసరికే చాలామంది చనిపోయారు. మధ్యాహానికి కూడా బస్సును బయటకు తీయలేకపోయారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతా నుంచి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి రెండేసి లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..ముర్షిదాబాద్ వద్ద కాల్వలో పడిన బస్సును వెలికి తీస్తున్న సహాయక సిబ్బంది